ఎట్టకేలకు ఇండియాకు రానున్న శ్రీదేవి భౌతిక కాయం !
Published on Feb 27, 2018 4:10 pm IST

దుబాయ్ లో గత ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన నటి శ్రీదేవి భౌతిక కాయం ఎట్టకేలకు అని రకాల అధికారిక ప్రక్రియలను పూర్తి చేసుకుని ఇంకొద్దిసేపట్లో కుటుంబ సభ్యుల చేతికి రానుంది. గత రెండు రోజుల నుండి శ్రీదేవి భర్త బోనీ కపూర్, కొంతమంది కుటుంబ సభ్యులు, అక్కడి భారత దౌత్య అధికారులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకున్నారు.

పూర్తి విచారణ తర్వాతే పోలీసులు ఎంబామింగ్ (సుగంధద్రవ్యాలతో భద్రపరిచే విధానం) నిమిత్తం శ్రీదేవి భౌతికకాయాన్ని భారత కాన్సులేట్, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకొద్దిసేపట్లో ఈ ప్రక్రియ కూడ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు శ్రీదేవి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం ముంబై తీసుకురానున్నారు. ఇప్పటికే శ్రీదేనికి నివాళులర్పించేందుకు భారీగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు అనిల్ కపూర్ ఇంటి వద్దకు చేరుకున్నారు.

 
Like us on Facebook