విజయ్ దేవరకొండ కొత్త ‘అర్జున్ రెడ్డి’ హిట్ అవుతుందా ?

Published on Apr 23, 2019 6:40 pm IST

విజయ్ దేవరకొండ క్రేజ్ ను మార్కెట్ చేసుకోవడానికి తమిళ్ నిర్మాతలు విజయ్ ప్లాప్ సినిమాల్ని కూడా వదలట్లేదు, వాటిని కూడా రిలీజ్ చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ , పూజా జావేరి జంటగా నటించిన చిత్రం ‘ద్వారకా’. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు.

అయితే 2017 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక చతికల పడింది. కాగా ఇప్పుడు ఈ సినిమాను తమిళంలోకి ‘అర్జున్ రెడ్డి’ పేరుతో డబ్ చేసి ఈ వచ్చే శుక్రవారమే విడుదల చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఈ కొత్త ‘అర్జున్ రెడ్డి’ హిట్ అవుతుందా ? ‘నోటా’ పుణ్యమా అని విజయ్ కు అక్కడ బాగానే మార్కెట్ పెరిగింది. దాంతో క్యాష్ చేసుకోవాలనే నిర్మాతలు ఆలోచనలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.

ఇక విజయ్ దేవరకొండ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ ‘ఆదిత్య వర్మ’గా అక్కడ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :