వాల్మీకి అసిస్టెంట్ ముని మాణిక్యం డబ్బింగ్ స్టార్ట్

Published on Aug 17, 2019 4:17 pm IST


వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న వాల్మీకి చిత్ర టీజర్ విడుదల చేయడం జరిగింది. వరుణ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఊర మాస్ అవతారంలో కేకపుట్టించేలా ఉన్నాడు. బాగాపెరిగిన గడ్డం ఉంగరాల జుట్టు, మేడలో దండలు, నల్లని బట్టలలో వరుణ్ కరుడుగట్టిన రౌడీలా భయంకరంగా ఉన్నాడు. పాత్రకు తగ్గట్టు ఆయన నటన కూడా టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అమిత ఆవేశం, అలాగే హాస్యం పండించే విలన్ గా వరుణ్ అలరించనున్నాడు.

కాగా ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. దర్శకుడు హరీష్ శంకర్ యాక్టర్ బ్రహ్మజీ తో డబ్బింగ్ థియేటర్లో కలిసి దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్ లోపోస్ట్ చేసి “మా కొత్త యాక్టింగ్ టీచర్ బ్రహ్మజీ…ముని మాణిక్యంగా, డబ్బింగ్ స్టార్ట్….” అని కామెంట్ కూడా పెట్టారు. హీరో వరుణ్ తేజ్ పక్కన ఉండే ముని మాణిక్యం అనే ఓ కీలకపాత్రలో బ్రహ్మజీ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :