వాల్మీకి లో డబ్ స్మాష్ బ్యూటీ !

Published on Mar 27, 2019 9:13 pm IST

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తండా కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్ద్ పాత్రలో తమిళ హీరో అథర్వ మురళి నటించనున్నాడని సమాచారం. ఇక లక్ష్మి మీనన్ పాత్ర కోసం డబ్ స్మాష్ ఫేమ్ మిర్నలిని రవి ని తీసుకున్నారట. ఆమె నటించిన తాజా చిత్రం సూపర్ డీలక్స్ ఈనెల 28న విడుదలకానుంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ వాల్మీకి కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More