‘డ్యూడ్’ హీరో సైఫై సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

‘డ్యూడ్’ హీరో సైఫై సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

Published on Jan 21, 2026 11:03 PM IST

Love Insurance Kompany

గత ఏడాది వరుస హిట్స్ కొట్టిన కోలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో డ్యూడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకరు. ప్రదీప్ హీరోగా 2025 లో మొత్తం మూడు సినిమాలు రావాల్సి ఉంది. కానీ రాలేదు. మరి ఆ మూడో చిత్రమే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Love Insurance Kompany). దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం సైఫై జానర్లో కనిపించి మంచి బజ్ ని ఆడియెన్స్ లో సంతరించుకుంది. అలా గత డిసెంబర్ లోనే రిలీజ్ కి రావాల్సి ఉంది కానీ వాయిదా పడింది.

అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ ఎప్పుడు అనేది లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఈ సినిమాని మార్చ్ నెలలో తీసుకురావాలని చూస్తున్నారట. మార్చ్ లో ఆల్రెడీ ప్యాకెడ్ గా భారీ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మూమెంట్ లోనే ఈ సినిమాని తెస్తున్నట్టు తెలుస్తుంది. మార్చ్ చివరికి అలా చిత్ర యూనిట్ రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా 7 స్క్రీన్స్ ఇంకా రౌడీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు