ఓటిటి సమీక్ష: ‘స్ట్రేంజర్ థింగ్స్ – సీజన్ 5’ – వాల్యూమ్ 2 – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

ఓటిటి సమీక్ష: ‘స్ట్రేంజర్ థింగ్స్ – సీజన్ 5’ – వాల్యూమ్ 2 – తెలుగు డబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Published on Dec 26, 2025 3:14 PM IST

Stranger-Things-S5

విడుదల తేదీ : డిసెంబర్ 26, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : నెట్‌ఫ్లిక్స్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మిల్లీ బాబీ, నోవాః స్క్నాప్, జేమీ కాంప్ బెల్ బోవెర్ ,ఫిన్ వోల్ఫ్ హార్డ్, డేవిడ్ హార్బర్, గెటెన్ మటరాజో, కాలెబ్ మెక్లాంగ్లిన్, జో కెరీ, తదితరులు
దర్శకులు : ది డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్), షాన్ లెవీ
నిర్మాత : హీలేరి లేవిట్
సంగీతం : కైల్ డిక్సన్, మైఖేల్ స్టైన్
సినిమాటోగ్రఫీ : కాలెబ్ హేయ్ మాన్
ఎడిటింగ్ : డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న అవైటెడ్ వెబ్ సిరీస్ నే ‘స్ట్రేంజర్ థింగ్స్’. సక్సెస్ ఫుల్ గా మొత్తం నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకొని చివరి సీజన్ కి మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇలా దీనిని మొత్తం మూడు భాగాలుగా డివైడ్ చేసి వాల్యూమ్స్ పేరిట రిలీజ్ చేస్తూ వచ్చారు. మరి లేటెస్ట్ గా వాల్యూమ్ 2 గా మొత్తం 3 ఎపిసోడ్స్ వచ్చాయి. మరి ఈ వాల్యూమ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

గత ఎపిసోడ్స్ కి కొనసాగింపుగా మొదలైన ఈ వాల్యూమ్ లో విల్ (నోవాః స్క్నాప్) కి పవర్స్ వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ (తన దగ్గర ఉన్నవాళ్లు) చూసి షాకవుతారు. అక్కడ నుంచి విల్, వెక్నా (జేమీ కాంప్ బెల్ బోవెర్) పంపిన డెమోగార్గన్స్ ని మాత్రమే కాకుండా వెక్నాని కూడా నియంత్రించగలడు అని తన తోటివారు భావిస్తారు. ఇంకోపక్క అప్ సైడ్ డౌన్ లో ఉన్న డస్టిన్ (గెటెన్ మటరాజో), స్టీవ్ హారింగ్ టన్ (జో కెరీ) అండ్ గ్యాంగ్ వెక్నా అసలు ఎక్కడ నుంచి ఇదంతా చేస్తుంది? దాని అసలు స్థావరాన్ని కనుక్కునే వేటలో ఉంటారు. ఇంకోపక్క వెక్నా బందీ చేసిన 12 మంది పిల్లలు అందులోని మ్యాక్స్ (సదీ సింక్) ఇంకా మైక్ చెల్లెలు హాలీ వీలర్ (నెల్ ఫీలర్) లు ఆ లోకంలో బందీ కబడతారు. అలాగే హాకిన్స్ నగర రక్షణ దళం బంధించి ఉంచిన కాళీ (లిన్నీ బెర్తెల్సన్) తో వారేం ప్రయోగాలు చేశారు. ఎందుకు మళ్ళీ ఎల్ (మిల్లీ బాబీ) కోసం అంత ఆరాటపడుతున్నారు? వెక్నా అసలు ప్లాన్ ఏంటి? మ్యాక్స్ మళ్ళీ తిరిగి వచ్చిందా? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి వెక్నాని శాశ్వతంగా అడ్డుకునేందుకు వేసిన ప్లాన్ ఏంటి అనేవి ఈ 3 ఎపిసోడ్స్ లో వృత్తాంతం.

ప్లస్ పాయింట్స్:

ఎలాంటి సందేహం లేకుండా బాలన్స్ గా వచ్చిన ఈ మూడు ఎపిసోడ్స్ కూడా ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చే విధంగానే కొనసాగాయని చెప్పవచ్చు. అయితే ఇది ముగింపు సీజన్ పైగా వీటి నుంచే ఎండింగ్ కి అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈసారి కథనం ఒకింత ఎమోషనల్ పరంగా ఎక్కువ కనిపిస్తుంది. దీనితో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు.

అలాగే గత నాలుగు ఎపిసోడ్స్ లో విడిపోయిన టీం అంతా మళ్ళీ కలిసి కనిపించడం ఇందులో మరింత నిండుగా అనిపిస్తుంది. ఇది మరొక ట్రూ ఎమోషన్ అని చెప్పాలి. అంతే కాకుండా ఈసారి సైంటిఫిక్ గా కూడా కొన్ని సీన్స్ థ్రిల్ చేస్తాయి. ఇంకా డస్టిన్, స్టీవెన్ నడుమ సీన్స్ అండ్ ఎమోషన్స్ తమ కాంబో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాయి. ఇంకా విల్ రోల్ పై మూడో ఎపిసోడ్ లో తీసుకున్న ఎమోషనల్ టేక్ కూడా బాగుంది.

ఇక వీటితో పాటుగా మొదటి రెండు ఎపిసోడ్స్ లో సాలిడ్ క్లైమాక్స్ పోర్షన్స్ వీక్షకులని ఎగ్జైట్ చేస్తాయి. మెయిన్ గా విల్, వెక్నాని కూడా కంట్రోల్ చేసి దాన్ని గాయపరచడం అనేది ఫ్యాన్స్ ని ఉత్తేజపరుస్తుంది. అలానే మ్యాక్స్ ఇంకా హాలీ వీలర్ లపై ట్రాక్ కూడా డీసెంట్ గా అనిపిస్తుంది. ఇలా చాలా వరకు అందరి ట్రాక్స్ మంచి ఎమోషన్స్ తో బ్యాలన్స్డ్ వెళ్లడం ఈ మూడు ఎపిసోడ్స్ లో మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ మూడు ఎపిసోడ్స్ లో ఎమోషనల్ పార్ట్ కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకోవడం మూలాన మంచి ఇంకా ఎక్కువ ఎగ్జైటింగ్ అండ్ అడ్వెంచర్ మూమెంట్స్ లో డోస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. దీనిని కూడా ఇంకొంచెం బ్యాలన్స్డ్ గా మైంటైన్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇంకొన్ని మూమెంట్స్ ని కొంచెం డ్రాగ్ చేసిన ఫీల్ కలుగుతుంది.

జోనాథన్, నాన్సీ నడుమ కొన్ని డైలాగ్స్ తగ్గించాల్సింది. అలానే ఈసారి కూడా వి ఎఫ్ ఎక్స్ వర్క్ మరీ అంత టాప్ నాచ్ లో అనిపించలేదు. అలానే గత నాలుగో ఎపిసోడ్ లో విల్ ని అంత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయడంతో తన రోల్ నుంచి ఇంకొంచెం అంచనాలు పెరిగాయి అందరిలో కానీ వాటిని ఆశించి తన సైడ్ నుంచి ఇంకా ఎగ్జైటింగ్ థింగ్స్ ని ఆశించేవారు కొంచెం డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా మూడో ఎపిసోడ్ కి కూడా ఒక సాలిడ్ ఎండింగ్ తో చివరి ఎపిసోడ్ కి లీడ్ మిగిల్చి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సీజన్ అంతా ఒకేసారి తెరకెక్కించారు కాబట్టి గత నాలుగు ఎపిసోడ్స్ తరహాలోనే నిర్మాణ విలువలు మైంటైన్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ వర్క్ ఇంకా ఎఫెక్టీవ్ గా ఉంది. కొన్ని సీన్స్ ని తమ స్కోర్ తో ఇంకా బాగా ఎలివేట్ చేశారు కైల్ డిక్సన్ మరియు మైఖేల్ స్టైన్ లు. అలాగే కెమెరా వర్క్ కూడా సాలిడ్ గా ఉంది. డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో ల ఎడిటింగ్ బాగుంది కానీ కొన్ని సీన్స్ తగ్గించాల్సింది.

ఇక దర్శకులు డఫర్ బ్రదర్స్ అండ్ షాన్ లెవీ లు మంచి వర్క్ అందించారు. ఎమోషనల్ గా అలాగే ఈ సిరీస్ ఫ్యాన్స్ కోరుకునే ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ ని ఈ మూడు ఎపిసోడ్స్ లో బాగా మైంటైన్ చేశారు. కాకపోతే ఇంకొంచెం థ్రిల్ మూమెంట్స్ ని కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఇది మినహా తమ వర్క్ ఈ మూడు ఎపిసోడ్స్ లో మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5: వాల్యూమ్ 2 నుంచి వచ్చిన ఈ మూడు ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి ఒక డీసెంట్ ట్రీట్ ని అందించాయి అని చెప్పాలి. లీడ్ నటుల నుంచి ఒక చక్కటి ఎమోషన్స్ తో కూడిన మూమెంట్స్ అలాగే ఈ సిరీస్ ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ దాదాపు ఇందులో నీట్ గా మైంటైన్ చేయబడ్డాయి. కాకపోతే కొంచెం యాక్షన్ అండ్ థ్రిల్స్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే లాస్ట్ ఎపిసోడ్ కి కావాల్సిన మూమెంటం ని ఈ మూడు ఎపిసోడ్స్ అందిస్తాయి. సో డెఫినెట్ గా ఈ 3 ఎపిసోడ్స్ చూసి ఫైనల్ బ్యాంగర్ కోసం ఎదురు చూడండి.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు