“లైగర్” కోసం ఎదురు చూస్తున్నా – దుల్కర్ సల్మాన్

Published on Nov 13, 2021 12:00 am IST


ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వం లో తెరకెక్కిన పుష్పక విమానం చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి విషెస్ తెలుపుతూ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. తన సోదరుడు సినిమా కి సంబందించి విజయ్ దేవరకొండ పోస్ట్ ను చేయగా, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు హీరో దుల్కర్ సల్మాన్.

దుల్కర్ సల్మాన్ చేసిన ట్వీట్ కి గానూ, విజయ్ దేవరకొండ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు నా సోదరుడివి అంటూ చెప్పుకొచ్చారు. లాస్ ఏంజిల్స్ కి నేను 16 గంటల ఫ్లైట్ లో ఉన్నాను, నా టీమ్ ను వదిలి వెళ్ళను అనే కలలో నుండి మేల్కొన్నాను అని అన్నారు. అంతేకాక కురుపు చిత్రం కి బెస్ట్ విషెస్ తెలిపారు విజయ్. ఈ ట్వీట్ కి గానూ, దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ లైగర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :