బ్యూటిఫుల్ పోస్టర్ తో ‘శ్రీ శ్రీ’ అంటూ వస్తున్న దుల్కర్, పూజా హెగ్డేల అవైటెడ్ ప్రాజెక్ట్!

బ్యూటిఫుల్ పోస్టర్ తో ‘శ్రీ శ్రీ’ అంటూ వస్తున్న దుల్కర్, పూజా హెగ్డేల అవైటెడ్ ప్రాజెక్ట్!

Published on Jul 10, 2026 8:00 PM IST

మలయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తాను చేస్తున్న టాలీవుడ్ సినిమాకి మేకర్స్ ఇప్పుడు టైటిల్ ని రివీల్ చేసేసారు. స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇద్దరిపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేసి మేకర్స్ ‘శ్రీ శ్రీ’ గా టైటిల్ నామకరణం చేశారు.

దీనితో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి రవి నెలకుడితి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతుండగా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. గత ఏడాది ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా అతి త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి రానుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ది ప్యారడైజ్ నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు