‘ఛాంపియన్’ థియేటర్స్ లో దుల్కర్ సర్ప్రైజ్.. షాకింగ్ పాత్రలో

‘ఛాంపియన్’ థియేటర్స్ లో దుల్కర్ సర్ప్రైజ్.. షాకింగ్ పాత్రలో

Published on Dec 25, 2025 7:02 PM IST

champion 6

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ మేక హీరోగా మలయాళ బ్యూటీ సాక్షి హీరోయిన్ గా దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే “ఛాంపియన్”. కొన్ని యదార్ధ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ సినిమా మంచి బజ్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ సినిమాలో కంటెంట్ పరంగా ఆడియెన్స్ కి ప్రామిస్ చేసిన మేకర్స్ తమ సినిమా కోసం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఆడియెన్స్ కి మరో సర్ప్రైజ్ ని కూడా అందించింది.

మరి ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్ తన ప్రెజెన్స్ తో థియేటర్స్ లో ఆడియెన్స్ తో వావ్ అనిపించాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ సినిమాలో హీరో రోషన్ కి తండ్రి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించడం ఒకింత షాకింగ్ అని చెప్పాలి. దీనితో ఈ అంశం మాత్రం ఇప్పుడు రోషన్ ఛాంపియన్ చూసేందుకు వెళ్లిన థియేటర్స్ లో ఒక ఊహించని ఎలిమెంట్ గా మారింది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు