బెయిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో !

బెయిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో !

Published on Oct 1, 2018 12:43 PM IST

Vijay

ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారు. జిమ్ ట్రైనర్ మారుతీ గౌడ ను కిడ్నాప్ , దాడి చేసిన కేసులో విజయ్ ను గత నెల 23న పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ఫై విచారణలు గత శనివారం జరిగాయి. ఇక విచారణలను పూర్తి చేసిన న్యాయ స్థానం తీర్పును ఈ రోజున ప్రకటిస్తామని చెప్పింది.

ప్రస్తుతం ఆయన పరప్పన జైలు లోనే గడుపుతున్నారు. ఇక తీర్పు వాయిదా పడింది అని టీవీ లో చూసి తెలుసుకున్న విజయ్ తీవ్ర నిరాశతో బ్యారెక్ లోకి వెళ్లిపోయారు. దునియా విజయ్ పిల్లలు జైలుకు వచ్చి తన తండ్రి ని పరామర్శించారు. ఒక్కసారిగా ఆయనను చుసిన పిల్లలు బోరున విలపించారు. ఇక విజయ్ వారిని ఓదారుస్తూనే తాను కూడా కంటతడి పెట్టుకున్నారు. కాగా విజయ్ కు ఇద్దరు భార్యలు.

తాజా వార్తలు