‘అర్జున్ రెడ్డి’ కోలీవుడ్ లో విడుదలకానుంది !

‘అర్జున్ రెడ్డి’ కోలీవుడ్ లో విడుదలకానుంది !

Published on Feb 28, 2019 10:40 AM IST

అర్జున్ రెడ్డి ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ రిలీజ్ అవ్వడమేంటీ అనుకున్నటున్నారా.. ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ , పూజా జావేరి జంటగా నటించిన చిత్రం ‘ద్వారకా’. 2017 లో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తాజాగా తమిళంలోకి డబ్ చేసి విడుదలచేస్తున్నారు.

విజయ్ కెరీర్ లో కల్ట్ సినిమా గా నిలిచింది అర్జున్ రెడ్డి. ఇప్పుడు అదే టైటిల్ తో ఈ ద్వారకా చిత్రాన్ని నిర్మాత బాలాజీ మార్చి 15న అక్కడ విడుదలచేస్తున్నారు. ఇక గీత గోవిందం, నోటా తో విజయ్ కి అక్కడ క్రేజ్ బాగా పెరిగింది. దాంతో అయన నటించిన సినిమాలను అక్కడ విడుదలచేస్తున్నారు. మరి ఈ అర్జున్ రెడ్డి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. శ్రీనివాస రవీంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , మురళి శర్మ , సురేఖ వాణి ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు