నైజాంలో “ఆదిపురుష్” కి ఎర్లీ షోస్.?

Published on Jun 6, 2023 11:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఈ జూన్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ చిత్రం “ఆదిపురుష్”. దర్శకుడు ఓంరౌత్ తో ప్రభాస్ చేసిన ఈ బై లాంగువల్ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కించగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ సహా బిజినెస్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ రికార్డు సెట్ చేసిన ఈ సినిమా నైజాం బిజినెస్ లో భారీ నంబర్స్ సెట్ చేయగా.

ఆదిపురుష్ నైజాం హక్కులను అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకోగా అక్కడ అయితే ఈ చిత్రంకి వారు తెల్లవారు జాము షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అయితే తెల్లవారు జాము 4 గంటలకే షోస్ పడే ఛాన్స్ ఉందని అలాగే 1 గంట కి కూడా పరిశీలనలో ఉందని తెలుస్తుంది. మరి వీటిలో అయితే 4 గంటల షో కి అయితే దాదాపు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :