
మూడేళ్ళ కష్టానికి ప్రతిఫలంగా రిలీజ్ అయిన ‘బాహుబలి’ సినిమా మునుపెన్నడూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించని, కనీవినీ ఎరుగని భారీ సెట్స్, వార్ ఎపిసోడ్స్ మరియు సూపర్బ్ విజువల్స్ తో తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియన్ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే రికార్డ్ కలెక్షన్స్ ని సృష్టిస్తూ అన్ని చోట్లా సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఓవర్సీస్ నుంచి లోకల్ ఏరియాల వరకూ ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రతి ఏరియాలోనూ ఓల్డ్ రికార్డ్స్ ని తిరగరాస్తోంది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రెండు రోజుల్లోనే 2.6 కోట్ల కలెక్షన్ ని సాధించి రికార్డ్ సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రోజు 1.7 కోట్ల షేర్ సాధించింది. రెండవ రోజు రూ. 72,13,561 షేర్ సాధించి మొత్తంగా రెండు రోజుల్లో రూ. 2,68,81,916 సాధించింది. మొదటి రెండు రోజుల్లో ఈస్ట్ గోదావరిలో ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. మూడవ రోజు కూడా దీనికి మించి కలెక్షన్స్ వస్తుండడంతూ తూర్పు గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ మూడవ రోజు కూడా సుమారు 1 కోటి షేర్ వస్తుందని అంటున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ మార్క్ కి ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల స్టార్ పవర్ తోడవడంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.

