దూరదర్శన్ లో ఆ ఇద్దరి సినిమాల ఫై నిషేధం విధించిన ఈసీ !

Published on Mar 21, 2019 1:00 am IST

సీనియర్ నటి సుమలత, యంగ్ హీరో నిఖిల్ గౌడ సినిమాలను ఎన్నికలయ్యే వరకు దూరదర్శన్ లో ప్రసారం చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని మండ్య నుండి వీరిద్దరూ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా సుమలత , జేడీఎస్ నుండి నిఖిల్ ఈ లోక్ సభ ఎన్నికల్లో భరిలోకి దిగుతున్నారు.

అయితే మొదట కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన సుమలత కు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. పొత్తులో భాగంగా ఆ సీటును జేడీఎస్ కు కేటాయించింది. దాంతో సుమలత ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతుంది. అయితే ఆమె కు బీజేపీ నుండి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది.

ఇక జేడీఎస్ కు కంచుకోట గా వున్న మండ్య నియోజిక వర్గం నుండి మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు నిఖిల్ గౌడ. దాంతో వీరిద్దరి మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More