లెజెండ్ సినిమా చూస్తున్న ఎలక్షన్ కమీషన్

లెజెండ్ సినిమా చూస్తున్న ఎలక్షన్ కమీషన్

Published on Apr 24, 2014 2:00 PM IST

legend-censor-details
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా మార్చి 28న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకి ఈ సినిమాని బాన్ చేయాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేసు పెట్టి ఎలక్షన్ కమీషన్ కి ఫిర్యాదు చేసారు.

ఈ కేసు విచారంలో భాగంగా ప్రస్తుతం ఎలక్షన్ కమీషన్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో లెజెండ్ సినిమాని చూస్తున్నారు. ఈ సాయంత్రంలోగా వారు ఈ కేసును కొట్టి వేయడమా లేక నిజంగానే ఏ పార్టీని అన్నా ఇబ్బంది పెట్టేలా సీన్స్ ఉంటే బాన్ చేయడమా అనే విషయాన్ని తెలియజేస్తారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. బాలకృష్ణ కెరీర్లో లెజెండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తాజా వార్తలు