కళ్యాణ్ రామ్ చేతుల మీదగా విడుదలైన ‘ఎదురీత’ టీజర్ !

Published on Mar 14, 2019 7:26 pm IST

యంగ్ విలన్ శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయం అవుతున్నచిత్రం ‘ఎదురీత’. బాలమురుగన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. లియోనా లిషోయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ “మేం అడగ్గానే మా టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే… టైటిల్ గురించి మా టీమ్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. ‘ఎదురీత’ కన్ఫర్మ్ చేశాం. ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ ‘టైటిల్ ఏంటి?’ అని అడిగారు. ‘ఎదురీత’ అని చెప్పాను. అప్పుడు ఆయన ‘ఎదురీత’ సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావు గారు 1997లో నటించిన ‘ఎదురీత’ గురించి చెప్పారు. ఇటీవల వస్తున్న చిన్న సినిమాలను మా నాన్నగారు చూస్తున్నారు. వీడు కూడా అలాగే డ్యాన్సులు, ఫైటులు చేస్తాడని అనుకున్నారేమో. అందువల్ల, నేను నాన్నకు కథ, సినిమా గురించి వివరించా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా… ‘ఎదురీత’ టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా. రియల్ లైఫ్ లో నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇక, సినిమా కథ విషయానికి వస్తే… ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తరవాత ఏం జరిగిందనేదాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు. అరల్ కొరెల్లి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్” అన్నారు.

సినిమా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ . ఈ సినిమా నిర్మించడానికి ముఖ్య కారణం శ్రవణ్. ఆయనది కూడా మా సిద్ధిపేట్. శ్రవణ్ ఫాదర్ మా ప్రొఫెసర్. మా హీరో ఎంతో సహకారం అందించడంతో సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నా. ఆయనకు రుణపడి ఉంటాను” అన్నారు.

దర్శకుడు బాలమురుగన్ మాట్లాడుతూ “నిర్మాత లక్ష్మినారాయణగారు కొత్త అయినా.. ఆయనకు ఇదే తొలి సినిమా అయినా… ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. నేను అడిగినది ప్రతిదీ ఇచ్చారు. కథను, నన్ను నమ్మిన హీరో శ్రవణ్ కి థాంక్స్” అన్నారు.

లియోనా లిషోయ్ మాట్లాడుతూ “మా సినిమా టీజర్ విడుదల చేసిన నందమూరి కల్యాణ్ రామ్ గారికి థాంక్స్. ఫస్ట్ టైమ్ టీజర్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చాలా చాలా బావుంది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేశారు. నన్ను నమ్మి నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు బాలమురుగన్ గారికి స్పెషల్ థాంక్స్. అతడితో పని చేసేటప్పుడు నటిగా నా బలం గురించి, బలహీనత గురించి తెలుసుకున్నా. ఇక, మా హీరో శ్రవణ్ విషయానికి వస్తే.. మెంటల్లీ, ఫిజికల్లీ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

సంబంధిత సమాచారం :

More