ఇంటర్వ్యూ : రాహుల్ విజ‌య్ – నేను చేయబోయే కథలన్నీ చాలా సహజంగా ఉండాలి.

ఇంటర్వ్యూ : రాహుల్ విజ‌య్ – నేను చేయబోయే కథలన్నీ చాలా సహజంగా ఉండాలి.

Published on Sep 19, 2018 5:36 PM IST


నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కుమారుడు ‘రాహుల్ విజ‌య్’ హీరోగా ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. రాహుల్ సరసన కావ్యా థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో రాహుల్ విజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ సినిమాలో మీరు లవర్ బాయ్ కనిపించబోతున్నారు. అసలు మీ పాత్ర గురించి చెప్పండి ?

జనరల్ గా కాలనీలో సరదాగా తిరిగే ఓ సగటు అబ్బాయిలా ఈ సినిమాలో కనిపిస్తాను. అయితే, అలాంటి అబ్బాయి లైఫ్ లోకి వచ్చిన ఓ అమ్మాయి వల్ల అతని జర్నీ మాతురుంది. అంటే ఓ రెస్పాన్సిబులిటీ పర్సన్ ల మారతాడు, బట్ ఆ మార్పు అతని ఫ్యామిలీకి మంచి చేస్తోంది గాని, అతనికి మంచి చెయ్యదు. ఈ ప్రక్రియలో అతనికి వచ్చే ప్లస్ లు ఏమిటి ? మైనస్ లు ఏమిటి ? తాను పేస్ చేసే పరిస్థితులు ఎలా ఉంటాయి ? ఫైనల్ గా తాను అనుకున్నది ఎలా అచీవ్ చేశాడు అనేది ఈ సినిమా అండి.

ఇండస్ర్టీలో పుట్టిపెరిగిన అబ్బాయిగా దగ్గర నుండి, ఇప్పుడు ఓ హీరో అయ్యే దాకా.. మీ జర్నీ గురించి చెప్పండి ?

పది పదిహేను సంవత్సరాల క్రితం ఫైట్ మాస్టర్ విజయ్ అంటే.. ఎంత బిజీనో మీకు తెలుసు. డాడికి టైం ఉండదు, అందుకే చిన్నప్పటి నుండి డాడీ వెంట కుదిరినప్పుడల్లా షూట్స్ కి వెళ్ళేవాడ్ని, ఆ వాతావరణం అబ్జర్వ్ చేసేవాడ్ని. అలా నా ఇంట్రస్ట్ చూసి.. డాడి నన్ను లారెన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ క్లాస్ లో చేర్పించారు. అక్కడ నుండి, నేను డాన్స్ లో చాలా వేరియేషన్స్ నేర్చుకున్నాను. అలాగే బ్యాంకాక్ వెళ్లి ఫైట్స్ నేర్చుకున్నాను. ఇక యాక్టింగ్ వచ్చేసరికి దేవదాస్ కనకాలగారి దగ్గర, వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇవ్వన్నీ నేర్చుకోవటానికి మా డాడి ఎంకరేజ్ మెంట్ కూడా చాలా ఉంది అండి. ఎందుకంటే ఆయనకు నన్ను హీరోగా చూడటం ఆయన డ్రీమ్.

మీరు ఇన్ని రకాలుగా డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ఇలా అన్ని నేర్చుకున్నారు. మరి ఎందుకు ఇంత సింపుల్ లవ్ స్టోరీతో మీ డెబ్యూ చేస్తున్నారు..? మీ టాలెంట్ పరిపూర్ణంగా చూపించే ఓ మాస్ అండ్ పవర్ ఫుల్ స్టోరీ.. మీ ఫస్ట్ మూవీ అయితే బాగుండేది కదా ?

అలాంటి సినిమాలు చెయ్యటానికి ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు అండి. అదికాక అలాంటి సినిమాలు నేను ఎప్పుడైనా చెయ్యచ్చు. కానీ ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీ ట్వంటీ ఏజ్ లో చేస్తేనే బాగుంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశాను. అయినా నేను కథ జడ్జ్ చేసేముందు ఒక కొన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకున్నాను. నేను చేయబోయే కథలన్నీ చాలా సహాజంగా ఉండాలి. అంటే సొసైటీకి చాలా దగ్గరగా అనిపించాలి. ప్రతి ఒక్కరు నా పాత్రను ఓన్ చేసుకోగలగాలి.

మీ నాన్నగారు పెద్ద ఫైట్ మాస్టర్. ఆయన పరిచయాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ తోనే మీ ఫస్ట్ సినిమా ఎందుకు చేయలేకపోయారు ?

మేం డైరెక్టర్ కంటే, కథనే ఎక్కువు అని నమ్మాము. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా సినిమాకు వెళ్తే ఫస్ట్ అడిగే ప్రశ్న.. కథ ఎలా ఉంది అని. అందుకే మేం కథనే నమ్మాము. కరెక్ట్ గా ఆ టైంలోనే రాము కొప్పుల ఈ కథ చెప్పారు. మాకు మా డాడికి చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఒక కథతో వెళ్తే.. నేను అనే వాడ్ని జనంలోకి బాగా వెళ్తానని అనిపించింది.

మొదట సుకుమార్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కానీ మీ నాన్నగారు లేదండి మేం చేసుకుంటాం అన్నారట. దేనికి ?

సుకుమార్ గారు అప్పటికే రంగస్థలం సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఆయనకు అస్సలు టైం లేదు. దాంతో ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, డాడినే ఆయనతో మేమే ప్రొడ్యూస్ చేస్తాం సార్ అని చెప్పారు. కానీ..సుకుమార్ గారు మా టీమ్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు. స్క్రిప్ట్ దగ్గర నుండి ప్రమోషన్స్ వరకు ఆయన అండగా నిలబడ్డారు.

ఈ సినిమా చూశాక, మీ నాన్నగారి రియాక్షన్ ఏమిటి ?

డాడి సినిమా చూసి వచ్చి ఒక ఎమోషనల్ గా.. ఒరేయ్ నేను ముప్పై సంవత్సరాల నుంచి సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. ఈ మూవీ ఎంతవరకు అయినా సక్సెస్ కానియ్యి. అది మన చేతుల్లో లేదు. మనం చెప్పలేము కూడా. కానీ, మనం మాత్రం ఓ మంచి సినిమా చేశాము. నువ్వు ఇక హీరోగా సక్సెస్ అయిపోయినట్లే.. అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే నాకు ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి బెస్ట్ కాంప్లిమెంట్.

నిహారికతో మీరు చేస్తున్న మూవీ ఎంత వరకు వచ్చింది ?

బాగా వస్తుందండి. అది ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, న్యూ ఏజ్ లవ్ స్టోరీ. లైక్ పెళ్లి చూపులు శైలిలో సాగుతుంది. ఇంకో ఒక్క టెన్ డేస్ షూట్ చేస్తే.. సినిమా దాదాపు పూర్తవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు