‘ఈ నగరానికి ఏమైంది’ చాలా బాగుందట !

‘ఈ నగరానికి ఏమైంది’ చాలా బాగుందట !

Published on Jun 19, 2018 10:28 PM IST


‘పెళ్లిచూపులు’ అనే చిన్న చిత్రంతో ఘన విజయం సాధించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ ‘ఈ నగరానికి ఏమైంది ?’ అనే మరో చిన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘పెళ్లిచూపులు’ చిత్రం లానే ఈ చిత్రంలో కూడా చాలా మంది కొత్త నటీనటులే నటించారు. ఒక్క తరుణ్ భాస్కర్ తప్ప ఈ చిత్రానికి ఎలాంటి స్టార్ వాల్యూ లేదు. అయినా ప్రేక్షకుల్లో మాత్రం ఈ చిత్రం మీద బాగానే అంచనాలు ఉన్నాయి. మరి పెళ్లిచూపులు లాగే ఈ చిత్రం కూడా భారీ విజయం నమోదు చేస్తుందా..? అంటే చేస్తుందనే చెప్తున్నారు ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులు.

తరుణ్ భాస్కర్ తన మొదటి సినిమా తీసిన మేకింగ్ శైలిలోనే ఈ చిత్రాన్ని కూడా తీశారట. ఇందులో కూడా స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, వారి మధ్య పుట్టే, ప్రేమ దాని తాలూకు సంఘర్షణ వంటివి ప్రధానంగా ఉంటాయని సమాచారం. అలాగే ఇప్పటి యువత ప్రవర్తనను, ఆలోచనా విధానాన్నే, తరుణ్ కామెడీ సోర్స్ గా వాడుకుని మంచి ఎంటర్ టైనర్ గా రూపొందించారని తెలుస్తోంది. ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించడం ఈ సినిమాకి ప్లస్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు