ఇటీవల కన్నడ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం “మార్క్” (Mark) కూడా ఒకటి. తన గత చిత్రం “మ్యాక్స్” తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా ఇపుడు వారు డేట్ ఫిక్స్ చేశారు.
దీనితో ఈ సినిమా ఈ జనవరి 23 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.ఇక ఈ సినిమా ఆరోజు నుంచి కన్నడ, తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనుంది. మరి ఈగ, బాహుబలి, సైరా తదితర సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న సుదీప్ మార్క్ (Mark) కి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


