షూటింగ్ లో జాయిన్ అయిన ఈషా రెబ్బా !

Published on Apr 9, 2019 2:12 pm IST

కోలీవుడ్ లో జి వి ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క షూటింగ్ చెన్నై లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది ఈషా రెబ్బా.

ఆమె తోపాటు ఈ సినిమాలో ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా తో హిట్ కొట్టి ఈషా కోలీవుడ్ లో బిజీ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా తో పాటు ఈషా ప్రస్తుతం తెలుగులో డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత సమాచారం :