కన్నడ సూపర్ స్టార్ సరసన ‘తెలుగు హీరోయిన్’ !

కన్నడ సూపర్ స్టార్ సరసన ‘తెలుగు హీరోయిన్’ !

Published on Oct 1, 2018 6:28 PM IST

kannada

‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’ మరియు ఇటీవలే వచ్చిన బ్రాండ్ బాబు చిత్రాలతో ఆకట్టుకున్న ఈషా.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత చిత్రంలో నటిస్తోంది.

కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఈ తెలుగు హీరోయిన్ ఓ కన్నడ స్టార్ హీరోతో కూడా కలిసి, స్క్రీన్ రొమాన్స్ చేయబోతుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చిత్రంలో ఈషా నటించనుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర కాలేజీ లెక్చరర్ అని తెలుస్తోంది.

లక్కీ గోపాల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత కిరణ్ కుమార్ నిర్మించనున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ‘అజనీష్.బి.లోకనాథ్’ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా మన తెలుగు హీరోయిన్, కన్నడంలో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

తాజా వార్తలు