లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తెలుగు అమ్మాయి !

Published on Mar 31, 2019 12:55 pm IST

అంతకుముందు ఆ తరువాత తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా. అయితే ఇప్పటివరకు 10 కి పైగా సినిమాల్లో నటించిన సరైన గుర్తింపును తెచుకోలేకపోయింది ఈ హీరోయిన్. దాంతో సరైన సక్సెస్ తో రేస్ లో కు రావాలని ఈ సారి ఆమె లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

డమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా కు సైన్ చేసిందట ఇషా. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇషా కెరీర్ కు బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :