ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం యాంకర్ గా మారిన యువ హీరోయిన్ !
Published on Jun 16, 2018 4:49 pm IST

65వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కోసం రంగం సిద్దమయ్యింది . అతిరదమహారథుల సమక్షంలో మరి కొద్దీ గంటల్లో హైద్రాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ అవార్డుల ప్రధానోస్తవం జరుగనుంది . ఈ వేడుక లో యువ హీరోలు సందీప్ కిషన్ , రాహుల్ రవీంద్రన్ మేల్ యాంకర్స్ గా చేయబోతున్నారని మనకు తెలిసిందే వీరితో పాటు యువ కథానాయిక ఈషా రెబ్బా కూడా ఫిమేల్ యాంకర్ గా చేయనుంది .

ఇటీవలే ‘అరవింద సమేత’ చిత్రం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈషా . ఇక అందరి చూపు 65వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో తెలుగు బెస్ట్ కథానాయకుడు అవార్డు పైనే ఉంది. ఈ సారి ఈ అవార్డు కోసం 6గురు హీరోలు పోటీపడుతున్నారు వారిలో చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ ఉన్నారు .మరి వీరిలో ఈ అవార్డు ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook