‘ఏక్ మినీ కథ’ వాయిదా..

Published on Apr 26, 2021 7:02 pm IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలు ఆగిపోతున్నాయి. ఏదో ఫారిన్ షూట్లో ఉన్న రెండు మూడు సినిమాలు మినహా మిగతావన్నీ ఆగిపోయాయి. ఇక కొత్త సినిమాల విడుదల సంగతైతే చేప్పాల్సిన పనే లేదు. ‘వకీల్ సాబ్’ అనంతరం ఏప్రిల్ నెలలో రావాల్సిన సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. ‘లవ్ స్టోరీ, విరాటపర్వం, టక్ జగదీష్’లతో పాటు చిన్న సినిమాలు కొన్ని వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఇంకొక చిత్రం ‘ఏక్ మినీ కథ’ కూడ చేరింది.

సంతోష్ శోభన్ హీరోగా మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న చిత్రం ఇది. కార్తీక్ రాపోలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్, పాటలు సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇనిమను ముందుగా ఏప్రిల్ 30న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బయట పరిస్థితులు బాగోలేవు గనుక సినిమాను వాయిదావేస్తున్నట్టు ప్రకటించారు. అది కూడ చిన్న ఫన్నీ వీడియో ద్వారా తెలియజేశారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఏమిటనేది ఇంకా మేకర్స్ కూడ డిసైడ్ అయినట్టు లేదు.

సంబంధిత సమాచారం :