విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సుమతీ శతకం”. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా ఈ చిత్రం నుండి ‘ఎక్కడే ఎక్కడే’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ప్రేమ గీతాన్ని తిరుపతి జావన రచించగా, ప్రముఖ గాయకుడు ధనుంజయ్ సీపన అద్భుతంగా ఆలపించారు. అర్థవంతమైన సాహిత్యం, ఆహ్లాదకరమైన బాణీలతో సాగే ఈ పాట ప్రస్తుతం ఆదిత్య మ్యూజిక్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ మెలోడీ సాంగ్ త్వరలోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఎస్. హలేష్ సినిమాటోగ్రఫీ అందించగా, నహిద్ మహమ్మద్ ఎడిటర్‌గా వ్యవహరించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


