మనసుకు హత్తుకునేలా సాగిన జాను ట్రైలర్.

Published on Jan 29, 2020 5:01 pm IST

శర్వానంద్, సమంత జంటగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం జాను. తమిళ సూపర్ హిట్ మూవీ 96కి తెలుగు రీమేక్ గా వస్తుంది. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. చిన్నతనంలో విడిపోయి కలిసిన ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ని హృద్యంగా చెప్పినట్లున్నారు.

ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ కలిగిన ఓ జంట నిరీక్షణ, వారి మధ్య ప్రేమను సమంత, శర్వానంద్ తమ కళ్ళలో చక్కగా పలికించారు. స్కూల్ ఏజ్ లో కలిసి అనుకోని కారణాలతో విడిపోయి మళ్ళీ కలిస్తే వారి మధ్య నడిచే సున్నితమైన ప్రేమ కథే జాను అని తెలుస్తుంది. రెండు నిమిషాలకు పైగా గల ట్రైలర్ కట్టిపడేసింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, గోవింద్ వసంత్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More