ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో అల్లుఅర్జున్ 19 !

‘నా పేరు సూర్య’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్న ఈ చిత్రం మార్చి లో ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ను వెతికే పనిలో వున్నాడు త్రివిక్రమ్. బడా చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

ఇక బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి ‘ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. మరి ఈ మూడవ చిత్రం వీరికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version