ఈNఈ రిపీట్: ఈ నగరానికి మళ్ళీ ఏమైనట్టు?

ఈNఈ రిపీట్: ఈ నగరానికి మళ్ళీ ఏమైనట్టు?

Published on Nov 17, 2026 11:52 AM IST

టాలీవుడ్ యువతలో మంచి ముద్ర వేసుకున్న అతికొద్ది సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో చేసిన ఈ సినిమా అప్పట్లో థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రాణించలేదు కానీ తర్వాత కల్ట్ బొమ్మగా నిలిచి రీరిలీజ్ చేస్తే ఒరిజినల్ గా వచ్చిన ఓపెనింగ్స్ కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

అయితే ఈ సినిమా తర్వాత సీక్వెల్ ని ఈNఈ రిపీట్ అంటూ అనౌన్స్ చేశారు. అప్పడూ సాలిడ్ బజ్ ఉంది. కొంచెం ఆలస్యం అయినా సాలిడ్ క్వాలిటీ కంటెంట్ ని ఈసారి కూడా ప్లాన్ చేశారు కానీ ఇప్పటికీ ఏదో మిస్ అవుతున్న అనుభూతి. ఆల్రెడీ పలు సినిమాలు దీనితో పోటీలో ఉన్నాయి కానీ ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా అనే బజ్ ప్రస్తుతం యువతలో కానీ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో కూడా అంతగా కనిపించడం లేదు.

దీనితో మొదటి సినిమా ఎలా అయితే వచ్చినట్టు కూడా అంత చప్పుడు లేదో ఇప్పుడు ఈ సినిమాకి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. సో నేడు జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ పైనే అంతా ఆధారపడి ఉందని చెప్పాలి. పోటీలో ఓ రోజు ముందే వస్తున్న ఈ సినిమాకి తెలుగు యువత ఎలాంటి ఓపెనింగ్స్ ఇస్తారో కూడా చూడాలి.

తాజా వార్తలు