రామ్ ‘రెడ్’కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ !

రామ్ ‘రెడ్’కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ !

Published on Oct 30, 2019 4:48 PM IST

red2

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రాంరంభమైంది. ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ.. ‘ఇది నా 18వ సినిమా. ముహూర్తం కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు. కిషోర్‌తో ఇది నా మూడో సినిమా. డైరెక్షన్‌లో మూడో సినిమా కానీ.. రైటింగ్ సైడ్ పని చేసాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాం. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. థ్రిల్లర్ చుట్టూ తిరిగే కథ.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అనౌన్స్‌మెంట్ ఏం లేదని అన్నారు.. కానీ అన్నీ సెట్ చేసుకుని.. టైటిల్ అనుకున్న తర్వాత పక్కా ప్లానింగ్‌తో వస్తున్నాం. అందుకే ఇంత లేట్ అయింది. నవంబర్ 16న షూటింగ్ మొదలు కాబోతుంది’ అని అన్నారు.

కాగా ఈ చిత్రంలో రామ్ సరసన నివేత పేతురేజ్ మరియు మాళ‌విక శ‌ర్మ హీరోయిన్స్ గా నటించనున్నారు. కాగా రామ్ తన కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్ : పీటర్ హెయిన్స్ ,ఎడిటింగ్‌: జునైద్‌.

తాజా వార్తలు