జపనీస్ లో కలెక్షన్స్ కురిపించిన శ్రీ దేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’

జపనీస్ లో కలెక్షన్స్ కురిపించిన శ్రీ దేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’

Published on Sep 3, 2014 6:50 PM IST

English-Vinglish-Cantonese-
ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఇంగ్లీష్ వింగ్లీష్’. ఈ సినిమా 2012 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఎంత గ్యాప్ తీసుకున్నా శ్రీ దేవి నటనకి, అందానికి వన్నె తగ్గలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సినిమాని డబ్ చేసి జపనీస్ లో రిలీజ్ చేసారు.

జపనీస్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రజినీకాంత్ తర్వాత అంత క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం జపనీస్ లో వన్ మిలియన్స్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకి, అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. జపనీస్ నిర్మాత బాల్కీ ఈ సినిమాని జపనీస్ లో రిలీజ్ చేసారు.

టోక్యోలో జరిగిన ఈ చిత్ర ప్రీమియర్ షోకి శ్రీదేవి మరియు ఈ చిత్ర డైరెక్టర్ గౌరీ షిండే కలిసి హాజరయ్యారు. ఈ సినిమా కథాంశం అమెరికా వెళ్ళిన ఒక ఇండియన్ హౌస్ వైఫ్ చుట్టూ తిరుగుతుంది.

తాజా వార్తలు