‘ఎంత మంచివాడవురా’.. ఎక్కడ

Published on Nov 5, 2019 3:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గత నెలలోనే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. కానీ అప్పటి నుండి సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా ఏమో సంక్రాంతి బరిలో పోటీ పడుతూ జనవరి 15న విడుదల కానుంది.

సంక్రాంతి బరిలో పోటీ ఎలా ఉందో అందరికీ తెలుసు. పెద్ద చిత్రాలు ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ విడుదలకానున్నాయి. రజనీకాంత్ ‘దర్బార్’ కూడా అదే సమయంలో వస్తోంది. అంత పోటీని తట్టుకుని నిలబడాలంటే ప్రమోషన్లు తప్పనిసరి. సినిమా విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉన్నా విడుదల రోజున ఓపెనింగ్స్ కావల్సిందే.

పెద్ద సినిమాల్ని తట్టుకుని మంచి ప్రారంభం దక్కాలంటే ప్రేక్షకుల్ని ఇప్పటి నుండే ప్రచారంతో సినిమాకు హుక్ చేసుకోవాలి. కానీ టీమ్ ఏమో నిదానంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు.. ఉన్న రెండు నెలల సమయాన్ని టీమ్ సరిగ్గా వాడుకోగలిగితే చిత్రం పోటీని తట్టుకుని నిలబడగలదు.

సంబంధిత సమాచారం :