కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్‌కు సిద్ధమైన నిఖిల్!
Published on Nov 16, 2016 11:28 am IST

ekkadiki-pothav
హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును తన గత చిత్రం ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, తనకు బాగా కలిసివచ్చిన ప్రయోగాన్నే నమ్ముకొని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ రెడీ అయిపోయారు. ‘టైగర్’ సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయింది.

ఇక కొత్తదనమున్న సినిమాలు చేస్తాడన్న పేరున్న నిఖిల్ చేసిన సినిమా కావడం, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడం లాంటి అంశాలతో ఈ సినిమాకు నిఖిల్ కెరీర్లోనే పెద్ద బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 90కి పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. అక్కడ నిఖిల్‌కి ఇదే పెద్ద రిలీజ్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. హెబ్బా పటేల్, నందిత శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది.

 
Like us on Facebook