ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు, తెలుగు చిత్ర సీమలోని వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. అభిమానులు కోరుకునే యాక్షన్, యువత కోరుకునే లవ్ అండ్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్, వీటన్నిటితో పాటు ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ‘శ్రీమంతుడు’పై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుండి పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూసిన ఇండియా బిగ్గెస్ట్ కార్పోరేట్ మూవీ కంపెనీ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ని తీసేసుకున్నారు. ఈ డీల్ ఉన్నపాటుగా నిన్న సాయంత్రం జరిగిపోయింది.
గతంలో ఎరోస్ ఇంటర్నేషనల్ వారు మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలను కొనుగోలు చేసారు. ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టక పోయినా ఈ సినిమాపై ఉన్న అంచనాలు, పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఎరోస్ వారు ఓ భారీ మొత్తానికి ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నారు. దాంతో నిర్మాతలు రిలీజ్ కి ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఎరోస్ వారు ఈ సినిమాని మరింత గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. మిర్చి తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన రెండవ సినిమా కావడం, అదీ కాక మహేష్ బాబు హీరోగా నటించడం ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. మరి ఈ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..


