ఈ రామ నవమికి ఈటీవీలో వెరీ స్పెషల్ ఈవెంట్.!

ఈ రామ నవమికి ఈటీవీలో వెరీ స్పెషల్ ఈవెంట్.!

Published on Mar 30, 2022 5:44 PM IST


తెలుగు ప్రేక్షకులకు ఏ పండుగ వచ్చినా కూడా టెలివిజన్ తెరపై వారికి ఎప్పటికపుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో ఈవెంట్స్ ని అందిస్తూ వచ్చే ఛానెల్ ఈటీవీ. మరి ఈసారి నుంచి మాత్రం ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగిందని చెప్పాలి. ఏడాదిలో ఉండే మరిన్ని కీలక పండుగలకు కూడా సరికొత్త ఈవెంట్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు.

అయితే అలా ఈసారి బహుశా మొదటి సారి టెలికాస్ట్ కి తీసుకొస్తున్న వెరీ స్పెషల్ ఈవెంట్ “సీతారాముల కళ్యాణం చూతము రారండి”. ఈ ఏడాది శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ నుంచి రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమో మంచి ఆహ్లాదంగా ఉందని చెప్పాలి.

రామనవమికి కి చేసే అన్ని పనులు చేస్తూ అనసూయ తదితరులు కనిపిస్తున్నారు. అలాగే మంచి ఎమోషన్స్ కూడా ఈ ప్రోమో లో కనిపిస్తున్నాయి. అలాగే ఆల్రెడీ ఈ ప్రోమో 1.4 మిలియన్ వ్యూస్ ని కూడా క్రాస్ చేసింది. మరి మున్ముందు వచ్చే ప్రోమోలు అలాగే ఈ స్పెషల్ ఈవెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు