భారీ లెవల్లో దిగుతున్న మరొక తెలుగు ఓటీటీ

Published on Jun 22, 2021 8:09 pm IST

లాక్ డౌన్ ప్రభావంతో సినిమా థియేటర్లన్నీ మూతబడిన వేళ ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేశాయి. వాటికి ధీటుగా తెలుగు ఓటీటీ సంస్ధలు కూడ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అల్లు అరవింద్ సారథ్యంలో ఆహా ఓటీటీ రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే దీనికి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి. మంచి కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరొక తెలుగు ఓటీటీ రానుందనే టాక్ వినిపిస్తోంది.

అదే ఈటీవీ ఓటీటీ. బుల్లితెర రంగంలో తిరుగులేని ప్రస్థానం ఈటీవీ సొంతం. రామోజీరావు స్థాపించిన ఈ ఛానెల్ ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈటీవీ అంటే గొప్ప క్రెడిబిలిటీ ఉంది. అంతేకాదు ఈటీవీ వద్ద ఉన్నన్ని సినిమాలు మారే ఛానెల్ వద్దా లేవు. చాలావరకు పాత క్లాసికల్ సినిమాల హక్కులన్నీ ఈటీవీ వద్దనే ఉన్నాయి. వాటి నుండి సగం సినిమాల్ని ఓటీటీలో ఉంచినా ప్రేక్షకులకు కొన్ని వందల సినిమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ చిత్రాలతో పాటు రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద స్వయంగా నిర్మించిన సినిమాలు ఉండనే ఉన్నాయి. ఈ పాత సినిమాలతో సహా కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు, టాక్ షోలు, ఈటీవీ ట్రేడ్ మార్క్ అయిన సంప్రదాయకమైన కార్యక్రమాలు రూపొందించి ఓటీటీని ఘనంగా లాంచ్ చేయాలని చూస్తున్నారట.

సంబంధిత సమాచారం :