ఇంటర్వ్యూ : వెంక‌ట్ రామ్‌జీ – నేనిక్కడ ఉన్నానంటే పీవీపీగారి వల్లే !

Published on Aug 18, 2019 5:12 pm IST

వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్‌ గా రూపొందిన థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సందర్భంగా వెంక‌ట్ రామ్‌జీ మీడియాతో మాట్లాడారు. మరి ఈ సినిమా గురించి వెంక‌ట్ రామ్‌జీ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు వెంక‌ట్ రామ్‌జీ మాటల్లోనే..

 

‘ఎవరు’ సక్సెస్ పై ఎలా ఫీల్ అవుతున్నారు ?

సినిమా 20 % షూట్ బ్యాలెన్స్ ఉండగానే డిసెంబర్ లో నేను మూవీ మొత్తం చూశాను. అప్పుడే సినిమా సూపర్ హిట్ అవ్వబోతుందని మేం డిసైడ్ అయిపోయాము. అయితే ఈ సినిమా నేను ‘ఏ’ సెంటర్స్ లో మాత్రమే హిట్ అవుతుంది అనుకున్నాను. కానీ, మాస్ సెంటర్స్ లో వస్తోన్న ఆదరణ చూస్తుంటే.. నిజంగా షాక్ గా అనిపించింది. ఓవరాల్ గా ‘ఎవరు’ సక్సెస్ బాగా సంతృప్తిని ఇచ్చింది.

 

‘ఎవరు’ రీమేక్ ఫిల్మ్ కదా.. మీరు స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేశారు ?

సినిమాలో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నేను ఈ సినిమా స్క్రిప్ట్ లో ఫాలో అయింది అదే.

 

ఈ సినిమా మీరు చెయ్యటానికి గల కారణం ?

నిజానికి నేను పీవీపీగారికి ఒక కథ చెబుదాం అని వెళ్ళాను. కానీ ఆయన నాకు ఎవరు స్టోరీ లైన్ చెప్పారు. లైన్ వినగానే చాల బాగుంది అనిపించింది. శేష్ తో కూడా ఆయనే మాట్లాడారు. ఈ సినిమా ఇలా రావడానికి.. మొదలవ్వడానికి పీవీపీగారే కారణం.

 

రెజీనా క్యారెక్టర్ లో షేడ్స్ చాల బాగా పెట్టారు. ఆమె బాగా చేసింది ?

అవును, రెజీనా కళ్ళు భావోద్వేగాలను బాగా పలికించగలవు. అందుకే సినిమాలో నేను ఎక్కువుగా క్లోజ్ షాట్స్ పెట్టడానికి కారణం రెజీనానే. కథ చెబుతున్నప్పుడే ఆమె కథలోని తన క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అచ్చం సమీరాలానే ఆమె చాల బాగా చేసింది.

 

సినిమాలో నటీనటులు కూడా చాల బాగా సెట్ అయ్యారు ?

అవును. రెజీనా అండ్ మురళిశర్మగారు క్యారెక్టర్స్ అలాగే మిగిలిన యాక్టర్స్ లో విషయంలో కూడా ముందు నుంచీ మేం వాళ్లనే పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాము. వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకోలేదు. లక్కీగా వాళ్లే సెట్ అయ్యారు.

 

అడవి శేష్ కూడా రైటర్ కదా.. స్క్రిప్ట్ లో ఎలా హెల్ప్ అయ్యారు ?

శేష్ ని అందరూ రైటర్ అని అంటుంటారు గాని, తను స్క్రిప్ట్ లో ఎక్కువుగా ఇన్ వాల్వ్ అయ్యేదాని కంటే.. స్క్రిప్ట్ ఎలా ఉంది ? స్క్రిప్ట్ లో ఐడియాలు ఏం బాగున్నాయి అని మాత్రామే చెప్పగలడు. తను పేపర్ మీద రాసే రైటర్ కాదు, కానీ తను ఇచ్చే కొన్ని సలహాలు బాగుంటాయి. అలాగే అబ్బూరి రవిగారు కూడా.. ముఖ్యంగా అబ్బూరిగారు ‘ఎవరు’ క్లైమాక్స్ విషయంలో చాల బాగా హెల్ప్ చేశారు.

 

సినిమాలో డైలాగ్ లు చాల బాగున్నాయి ?

అబ్బూరి రవిగారే అలా రాశారు. ఆయనకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడే.. నా సినిమాలో ఫైట్స్ లాంటివి లేవు, సినిమాలో ప్రతి డైలాగ్ పేలాలి అని చెప్పాను. ఆయన చాల బాగా రాశారు.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే పీవీపీగారి వల్లే. ఆయన బ్యానర్ లోనే నా తదుపరి ఫిల్మ్ ఉంటుంది. నేను మొదట చెప్పాలనుకున్న కథను నా రెండో సినిమాగా చెయ్యాలనే ఆలోచన ఉంది.

 

సంబంధిత సమాచారం :