ఎవరు నైజాం లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Aug 23, 2019 10:41 am IST

అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఎవరు చిత్రం బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకెళుతోంది. ఎవరు విడుదలై రెండు వారాలవుతున్నా వసూళ్లు నిలకడగా సాగడం గమనార్హం. ముఖ్యంగా ఏ సెంటర్స్ మరియు మల్టీ ప్లెక్స్ లలో ఎవరు స్ట్రాంగ్ గా ఉంది.

నైజాంలో లో కూడా ఎవరు చిత్రం అంచలనాలకు మించిన వసూళ్లు రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎవరు నైజాంలో 2.80 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తుంది. ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాల విడుదల లేకపోవడం ఈ మూవీకి కలిసొచ్చే అంశం. దీనితో మరో వారం వరకు కూడా ఎవరు మూవీ మంచి వసూళ్లు సాధించే అవకాశం కలదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎవరు 9 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.

పివిపి పతాకంపై పరం వి పొట్లూరి, పెర్ల్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ తెరకెక్కించగా, శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అడివి శేషు తో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :