ఎన్టీఆర్ షో కి సూపర్ రెస్పాన్స్…ఐదవ వారం కూడా..!

Published on Sep 30, 2021 6:41 pm IST


జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి బుల్లితెర పై తన సత్తా చాటుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ప్రేక్షకులని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమం ఐదవ వారం కి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ బయటికి రావడం జరిగింది. ఐదవ వారానికి యావరేజ్ గా ఈ షో కి 4.70 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఇప్పటి వరకూ కూడా ఐదవ వారానికి తెలుగు లో ఈ తరహా రేటింగ్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

జెమిని టీవీ లో ప్రసారం అవుతున్న ఈ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో లో ప్రముఖులు సైతం వచ్చి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :