‘ఎవరు’ మొదటిరోజు కలెక్షన్స్ లో అదరగొట్టింది.

Published on Aug 16, 2019 4:08 pm IST

అడివి శేషు,రెజీనా కాసాండ్రా,నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో దర్శకుడు వెంకట్ రామ్ జీ తెరకెక్కించిన చిత్రం “ఎవరు” నిన్న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆసక్తికర సన్నివేశాలు, ఆలోచనకు అందని మలుపులతో దర్శకుడు ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా ఎవరు ని తెరకెక్కించాడు. కరెప్టెడ్ పోలీస్ అధికారిగా అడివి శేషుతో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మల నటన కూడా మూవీకి మంచి ఆకర్షణ చేకూర్చింది.

ఎవరు చిత్రం ఆంధ్ర,తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 1.7 కోట్ల షేర్ సాధించింది.ఇది ఇప్పటివరకు హీరో అడివి శేషు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ కావడం గమనార్హం. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మిగిలిన మూడు వారాంతపు దినాల్లో మరిన్ని మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు. దీనికితోడు వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఎవరు చిత్రానికి కలిసొచ్చే అంశం. ఇన్ని అనుకూలతల మధ్య ఎవరు ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూద్దాం.

సంబంధిత సమాచారం :