వసూళ్ళలో గూఢచారిని దాటేసిన ఎవరు.

Published on Aug 31, 2019 1:13 pm IST

అడివి శేషు, రెజీనా ల లేటెస్ట్ సెన్సేషన్ ఎవరు చిత్రం విడుదలై మూడు వారాలవుతున్నా బాక్సాఫీస్ వద్ద మెరుగైన కలెక్షన్స్ రాబడుతుందని సమాచారం. అలాగే ఎవరు మూవీ అడివి శేషు హిట్ మూవీ గూఢచారి లైఫ్ టైం వసూళ్లను దాటివేసిందని తెలుస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గూఢచారి కూడా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం అందుకుంది. ఇప్పుడు ఎవరు చిత్రం కూడా రెండవ వారం ముగిసేనాటికే బ్రేక్ ఈవెన్ చేరుకొని, ప్రస్తుతం బయ్యర్లకు లాభాలు పంచుతుంది.

కాగా అడివి శేషు తన తదుపరి చిత్రంగా మేజర్ అనే బయోపిక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో శేషు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర చేస్తుండగా, మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

సంబంధిత సమాచారం :