ఇళయరాజా ప్రకటనకు అందరూ ఫిదా !

Published on Jun 3, 2019 4:22 pm IST

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా నిన్న తన 76వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చెన్నైలో భారీ మ్యూజికల్ కాన్సెర్ట్ చేశారు. ఈ వేడుకకు వేలాదిమంది అభిమానులు, సంగీత ప్రియులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్ లాంటి వారు పాటలు పాడి అలరించారు.

వేడుక పూర్తైన వెంటనే ఇళయరాజా ఒక పెద్ద ప్రకటన చేశారు. అందులో సినీ సంగీతకారులు యూనియన్, ట్రస్ట్ భవనాన్ని తన సొంత ఖర్చులతో నిర్మిస్తానని మాటిచ్చారు. ఆయన నిర్ణయం పట్ల ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. ఇకపోతే ఇళయరాజా ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటిస్తున్న ‘తమిజరసన్’ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More