మామ అల్లుళ్ళు ఖమ్మం రమ్మంటున్నారు..!

Published on Dec 7, 2019 11:35 am IST

వెంకీ మామ టీం నేడు ఖమ్మం వేదికగా సందడి చేయనున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను అక్కడ నిర్వహించనున్నారు. నిన్న చిత్ర యూనిట్ ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది.ఖమ్మం లోని ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ నందు సాయంత్రం 6గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది. చిత్ర దర్శక నిర్మాతలు నటీనటులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమం నందు పాల్గొంటారని సమాచారం. అలాగే నేడు హీరోలైన వెంకటేష్ ,నాగ చైతన్య, హీరోయిన్స్ రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు.

వెంకీ మామ చిత్ర విడుదలకు ఇంకా కేవలం ఒక వారం సమయం మాత్రమే ఉండటంతో ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అటు వెంకటేష్ ఇటు అక్కినేని అభిమానులతో వేదిక సందడిగా మారనుంది. దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More