పెళ్లి పీటలెక్కనున్న సాహో భామ… !

Published on Oct 9, 2019 8:39 am IST

బాలీవుడ్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ సాహో మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఎవ్లీన్ పెళ్లికి సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా కి చెందిన డాక్టర్ మరియు వ్యాపారవేత్త అయిన తుస్సాన్ బింది ని ఆమె వివాహం చేసుకోనున్నారు. గత శనివారం ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎంగేజ్ మెంట్ జరుపుకొని ఈ విషయాన్ని ధృవీకరించారు. గత ఏడాదిగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే సినిమాలు తగ్గించిన ఎవ్లీన్ ఆయనతో పెళ్లి తరువాత ఆస్ట్రేలియా లో సెటిల్ కానున్నారట. ఏడాది క్రితం ఓ ఫంక్షన్ లో కలిసిన ఈ జంట పరిచయం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ మూవీ తో బాలీవుడ్ కి పరిచయమైన ఎవ్లీన్ హిందీ మీడియం, జబ్ హరీ మెట్ సజల్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. కాగా ఈ జంట పెళ్లి ముహూర్తం త్వరలో ప్రకటిస్తారట.

సంబంధిత సమాచారం :

X
More