మరొక్క నెలలో “సర్కారు వారి పాట” మాస్ బ్లాస్ట్.!

Published on Apr 12, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల కంప్లీట్ ఫ్యాన్ ఫీస్ట్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సినిమా పై మిగిలిన అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సరిగ్గా ఒక్క నెల మాత్రమే ఉందన్న మాట మంచి ఆసక్తిగా మారింది. ఎప్పుడో ప్యాండమిక్ కి ముందు మహేష్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసిన మహేష్ అభిమానులు ఈ నెల రోజుల గ్యాప్ పై చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

ఇదే రోజు వచ్చే నెల మే 12న సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా షూట్ అయ్యిపోయింది. అలాగే అప్డేట్స్ కూడా స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా అయితే మరో నెలలో మాస్ యుఫోరియా కనబడుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :