మహర్షి 100కోట్ల పైనే .. !

Published on Apr 12, 2019 8:19 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ మే 9న గ్రాండ్ గా విడుదలకానుందని తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈచిత్రానికి కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు 100కోట్లకు అమ్ముడవ్వగా నాన్ థియేట్రికల్ హక్కులు 45 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. దాంతో మొత్తం 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో బాహుబలి తరువాత అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రెండవ చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ రోజు ఈ చిత్రం నుండి రెండవ సాంగ్ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :