మళ్ళీ “ఆచార్య” రిలీజ్ పై ఎగ్జైటింగ్ బజ్..!

Published on Dec 26, 2021 10:32 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లు ఇంకో కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ఆల్రెడీ రిలీజ్ ఫిబ్రవరి 4నే అని ఫిక్స్ అయ్యింది.

అయితే మళ్ళీ ఆచార్య రిలీజ్ కి సంబంధించి పలు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి కానీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఒక ఎగ్జైటింగ్ బజ్ ఏమిటంటే ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతానికి చర్చల్లో ఉన్న దాని ప్రకారం ఫిబ్రవరి 4 నుంచి ఒక వారం ముందుకి అలా అంటే జనవరి 26కి ఈ చిత్రాన్ని షిఫ్ట్ చెయ్యాలని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :