“పుష్ప” పై మరో ఎగ్జైటింగ్ గాసిప్.!

Published on Jun 10, 2021 6:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారని తెలియడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. అలా అనేక రకాల ఇంట్రెస్టింగ్ వార్తల నడుమ మరో ఎగ్జైటింగ్ గాసిప్ బయటకి వచ్చింది.

దాని ప్రకారం ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు గాను మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. మరి ఒకవేళ ఇదే కనుక నిజం అయితే థియేటర్స్ లో రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. బన్నీకి చిరు పై ఎంత ప్రేమ ఉందో తెలిసిందే. అలాగే ఇది వరకు చిరు గత కొన్ని సినిమాల్లో అందులోని దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ కే బన్నీ కనిపించాడు. మరి ఈసారి చిరు వంతు వచ్చిందేమో.. కానీ మరింత గ్రాండియర్ కోసం ఏమో కానీ ఇది కానీ నిజం అయితే మరో లెవెల్ రచ్చ ఉంటుందని చెప్పాలి. ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :