‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్ ‌నేపథ్యం అదేనా ?

‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్ ‌నేపథ్యం అదేనా ?

Published on May 16, 2020 8:47 AM IST

Pushpa

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కాగా స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని పాటలను రికార్డ్ చేశారు. అందులో ప్రత్యేకమైన ఆ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగుతుందని.. పక్కా మాస్ అంశాలు ఈ సాంగ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సుక్కు- దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప సినిమా కోసం ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి. అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు