క్రేజీ మూవీ నుండి లేటెస్ట్ అప్ డేట్స్ !

sarkar

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కార్’. ఈ చిత్రంలో విజయ్ సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం సర్కార్ ఆడియో ఆల్బమ్ లోని మొదటి పాటను సెప్టెంబర్ 19న విడుదల చెయ్యబోతున్నారు. అయితే, చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ చిత్రం టీజర్ కూడా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలవ్వబోతుంది.

కాగా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎ ఆర్ రహెమాన్ సంగతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తోనిర్మిస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.

Exit mobile version