ప్రత్యేక ఇంటర్వ్యూ : అస్మితా సూద్ – ఇంకా నన్ను బాగా చూపించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను.

Published on Jul 1, 2014 6:53 pm IST


‘బ్రహ్మిగాడి కథ’, ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయమున్న తార అస్మితా సూద్. అస్మితా సూద్ హీరోయిన్ గా నటించిన తాజా సినిమా ‘ఆ ఐదుగురు’. ఈ సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి అస్మితా సూద్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ చివరి సినిమా ‘ఆడుమగాడ్రా బుజ్జి’ సరిగా ఆడలేదు. మరి ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ కి లోనవుతున్నారా.?

స) నా చివరి సినిమా విషయంలో బాగా నిరూత్సాహపడ్డాను. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను, కానీ అది బాగా ఆడలేదు. కానీ త్వరలో రిలీజ్ కానున్న ‘ఆ ఐదుగురు’ సినిమాతో మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తానని చాలా నమ్మకంగా ఉన్నాను.

ప్రశ్న) ‘ఆ ఐదుగురు’ సినిమా ఎలా ఉంటుంది.?

స) ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఈ సినిమాలో చాలా కొత్త పాయింట్ ని చెప్పడానికి ట్రై చేసాం. ఈ సినిమాలోని కథకి, పాత్రలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఈ సినిమా చేసాం.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఈ సినిమాలో నేనొక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాను. అలాగే నా టాలెంట్ ని నిరూపించుకోవడానికి చాలా స్కోప్ ఉన్న పాత్రని ఇందులో చేసాను. అలాగే ఈ సినిమాలో చాలా స్టంట్స్ కూడా చేసాను. వెంకట్ మరియు నా కాంబినేషన్ లో ఆసక్తికరమైన సీన్స్ ఉంటాయి.

ప్రశ్న) మీ కెరీర్ స్టార్టింగ్ గురించి, అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారో చెప్తారా.?

స) నేను సిమ్లాకి చెందిన అమ్మాయిని. చిన్నప్పటి నుంచి నేను స్టడీస్ లో బాగా యాక్టివ్ గా ఉండేదాన్ని, అలాగే నాకు ఎప్పుడు లైంలైట్ లో ఉండాలని కోరుకునేదాన్ని. పెద్ద పెద్ద హోర్దిన్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసేవి, నేను ఇక్కడ ఉండడానికి అవి కూడా ఓ కారణం. ఆ తర్వాత ముంబై వచ్చి చాలా రోల్స్ కోసం ఆడిషన్స్ కి అటెండ్ అయ్యాను. ముందుగా యూనినార్ యాడ్ కి ఎంపికయ్యాను. దాని ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా యాడ్స్ చేసాను. అవి చూసి నాకు బ్రహ్మిగాడి కథ సినిమా ఆఫర్ వచ్చింది.

ప్రశ్న) ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ ఎలా వస్తున్నాయి?

స) ఇప్పటి వరకూ నేను 3 తెలుగు సినిమాలు, కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమా చేసాను. టాలీవుడ్ లో నాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం నా చేతిలో కొన్ని మంచి సినిమా ఆఫర్స్ ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే అనౌన్స్ చేస్తాను.

ప్రశ్న) ఇన్ని భాషల్ని ఎలా మానేజ్ చేస్తున్నారు. అది మీకు టఫ్ గా అనిపించడం లేదా?

స) మొదట్లో చాలా సమస్యలు ఎదుర్కొనేదాన్ని.. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రామ్టింగ్ కూడా లేకుండా సీన్స్ చేస్తున్నాను.

ప్రశ్న) మీరు చేసిన సినిమాల ద్వారా సరైన సక్సెస్ ని అందుకోలేదు. ఒక హీరోయిన్ గా అది మిమ్మల్ని బాధించలేదా.?

స) వరుణ్ సందేశ్ తో నేను చేసిన మొదటి సినిమా డీసెంట్ హిట్. అంతే కాకుండా ఆ సినిమా నాకు గుర్తింపును కూడా తెచ్చింది. కొన్ని సార్లు అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అప్పుడు నన్ను ఇంకా బాగా చూపించగల డైరెక్టర్ కోసం వెతకాలని ఫీలవుతుంటాను.

ప్రశ్న) డైరెక్టర్స్ అన్నారు, మీకు తెలుగు ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్స్ తో కచ్చితంగా పనిచేయాలని ఉందా?

స) నాకు వైవిఎస్ చౌదరి, కృష్ణ వంశీ సినిమాల్లో నటించాలంటే చాలా ఇష్టం. వాళ్ళు తమ సినిమాల్లో హీరోయిన్స్ ని చాలా బాగా చూపిస్తారు.

ప్రశ్న) టాలీవుడ్ లో మీరు చేయనున్న తదుపరి సినిమాలేమిటి? అలాగే బాలీవుడ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా?

స) ప్రస్తుతానికి కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటి గురించి త్వరలోనే తెలియజేస్తాను. నేను మొదటి సినిమాకి సైన్ చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఇంత పెద్దది అని మరియు అలాగే నాకు ఇవ్వడానికి ఇక్కడ చాలా ఉందని నాకు తెలియదు. నేను ఐదు సినిమాలు చేసిన తర్వాత నా కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నాను. ప్రస్తుతానికి నో బాలీవుడ్ నా దృష్టి మొత్తం సౌత్ సినిమాలపైనే ఉంది.

ప్రశ్న) టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ఎవరు.?

స) నేను అల్లు అర్జున్ తో ఫ్రెండ్లీ గా ఉంటాను. అతని డాన్సింగ్ మరియు యాక్టింగ్ స్టైల్ కి చాలా పెద్ద అభిమానిని.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, తన కెరీర్ మరింత బాగుండాలని అస్మితా సూద్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం :

X
More